

యంగ్ హీరోయిన్ అంజలి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ స్టార్ విశాల్ సరసన ‘మకుటం’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విశాల్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా, సంగీతాన్ని జి. వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తాను స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి తనను ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు నిరంతరం ప్రేమిస్తున్నట్లు చెప్పేవాడని వెల్లడించారు. మొదట్లో అతన్ని పట్టించుకోలేదని, కానీ అతని పట్టుదల చూసి పదో తరగతిలో ఒక నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అతనికి నేరుగా రాఖీ కట్టేశానని, దాంతో అతను వదిలేస్తాడని అనుకున్నానని చెప్పారు. అయితే ఆ అబ్బాయి “రాఖీ కట్టినా నేను నీ అన్నయ్యను కాదు” అంటూ రాఖీని తీసి వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు. ఆ ఘటన తర్వాత అతన్ని మళ్లీ చూడలేదని తెలిపారు. ప్రస్తుతం తన జీవితంలో ఎవరూ ప్రత్యేక వ్యక్తి లేరని, తాను సింగిల్‌గా ఉన్నానని అంజలి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!