
సినిమాలు

బిహార్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ తన టయోటా ఇన్నోవా హైక్రాస్ కారులో కేవలం 12 వేల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన తర్వాత పెద్ద సాంకేతిక సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఈ20 ఇంధనానికి అనుకూలమైన ఈ వాహనానికి వారంటీ కింద సేవలు అందించాలని కోరినా, టయోటా నుంచి సహకారం లభించలేదని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
ఈ ఘటనతో ఈ20 ఇంధనానికి అనుకూలమైన వాహనాల పనితీరు, వారంటీ నిబంధనలపై వాహన యజమానుల మధ్య చర్చ మొదలైంది. అయితే, ఈ ఆరోపణలపై టయోటా నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. సంస్థ స్పందన కోసం వాహనదారులు, ఆటోమొబైల్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!