
క్రీడలు

పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సువేందు అధికారి పేరును భట్టాచార్య ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా రాష్ట్రంలో ఇద్దరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో బెంగాల్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!