

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వలస విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వలసదారుల విషయంలో తమ ప్రభుత్వం అతిగా కఠినంగా వ్యవహరించిందని అంగీకరించారు. నిర్బంధాలు, బహిష్కరణల ద్వారా అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, ఈ క్రమంలో సాధారణ వలసదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అభిప్రాయపడ్డారు. మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నేరాలకు పాల్పడిన వారిని దేశం నుంచి బహిష్కరించినందుకు తన ప్రభుత్వానికి మంచి మార్కులు పడ్డాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఉద్యోగాలు చేస్తూ, పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్నవారు చిన్నచిన్న నిబంధనలు ఉల్లంఘించినా వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం వల్ల నష్టం జరిగిందని అన్నారు. అలాంటి వారికి భవిష్యత్తులో చట్టబద్ధమైన హోదా కల్పించేలా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తన వైఖరిలో మార్పు కనిపిస్తున్న ట్రంప్.. ఇరాన్‌పై తిరిగి దాడులు ప్రారంభించకపోవచ్చని కూడా తాజాగా పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!