

నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్–అన్నా లెజినోవా దంపతుల విడాకులపై వస్తున్న ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
రెండేళ్ల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ 2026లో విడాకులు తీసుకుంటారని, అనంతరం నాలుగో పెళ్లి చేసుకుంటారని జోస్యం చెప్పారు. జ్యోతిష్యం ఆధారంగానే ఈ విషయం చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే, అప్పట్లో జర్నలిస్ట్ ఆయన అంచనాలను ప్రశ్నించినప్పటికీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు వేణుస్వామి తెలిపారు. ప్రస్తుతం విడాకులపై ప్రచారం నేపథ్యంలో ఆ పాత ఇంటర్వ్యూ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. పవన్ నాలుగో పెళ్లి చేసుకుంటారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, విడాకులు లేదా మరో పెళ్లిపై పవన్ కల్యాణ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!