
జనరల్

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. కొనసాగుతున్న శాంతి చర్చలు ఫలించకపోతే మళ్లీ సైనిక చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. హెజ్‌బొల్లాను ప్రోత్సహించే లేదా ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని ఇరాన్‌కు సూచించిన ట్రంప్, అవసరమైతే భవిష్యత్ దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా తరఫున జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా, ఇరాన్ తరఫున మహమ్మద్ బాఘర్ ఘాలిఫ్, అబ్బాస్ అరాఘ్చీ హాజరయ్యారు. ప్రాంతీయ స్థిరత్వం, భద్రతా అంశాలు, ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాలకు పరిష్కార మార్గాలే ఈ సమావేశాల ప్రధాన అజెండాగా ఉన్నట్లు సమాచారం. సమావేశానికి ముందు జేడీ వాన్స్ పాకిస్థాన్ ప్రధానితో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!