
సినిమాలు

ఇరాన్‌తో చర్చలు కొనసాగించి ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడం ఉత్తమ మార్గమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యమని ఆయన మళ్లీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో బుధవారం శ్వేతసౌధంలో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో రాజనీతిక మార్గాన్ని అనుసరించడం అవసరమని నెతన్యాహును కోరినట్లు తెలిపారు.
ఒప్పందం కుదిరితే అది అన్ని పక్షాలకు అనుకూలంగా ఉంటుందని, లేదంటే తదుపరి పరిణామాలు ఎలా మలుపుతిరుగుతాయో చూడాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన తన ‘ట్రూత్ సోషల్’ వేదికలో పంచుకున్నారు. ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలు మరింత బలంగా కొనసాగుతున్నాయని, భద్రతా అంశాల్లో ఇరుదేశాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!