

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో అమెరికా చరిత్రలోనే భారీ వెనుకడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు. తన పాలనలో మంచి వృద్ధిని నమోదు చేసిన స్టాక్ మార్కెట్ సైతం ఎన్నికల ఫలితాల ప్రభావంతో ఒక్కరోజులోనే 3 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని ట్రంప్ వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే ఈ పరిణామాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. తాము ఈ పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకుంటామని, గతంలో కంటే మరింత గొప్పగా, శక్తిమంతంగా ఎదుగుతామని ‘ట్రూత్ సోషల్’ వేదికగా పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాలతో ఎదురైన రాజకీయ సవాళ్లను అధిగమించి అమెరికాను మరింత బలంగా తీర్చిదిద్దుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!