

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నవంబరు 11 నుంచి 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థుల కోసం అపరాధ రుసుముతో కూడిన అదనపు గడువులను కూడా ప్రకటించారు. వివిధ దశల్లో ఈ గడువు డిసెంబరు 15 వరకు కొనసాగనుంది. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.
ఫీజుల వివరాల ప్రకారం రెగ్యులర్ అభ్యర్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. వృత్తివిద్యా కోర్సులకు చెందిన అభ్యర్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. వయోపరిమితి సడలింపు కోరుకునే విద్యార్థులు రూ.300 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమకు వర్తించే ఫీజు వివరాలను పరిశీలించి, ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించిన విధానంలో చెల్లింపులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. పరీక్ష ఫీజుకు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!