

దీపావళి వేడుకల సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోల భార్యలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఈ మహిళల ప్రత్యేక వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి సన్నిహిత స్నేహితులు, వ్యాపారవేత్తలు, ప్రముఖ సామాజికవేత్తలు పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ ఫొటోలు వేడుకలోని సందడి, సంతోషకరమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఈ ఫొటోల్లో ఉపాసన ఎరుపు రంగు చీరలో కనిపించగా, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి నలుపు రంగు దుస్తుల్లో మెరిశారు. మరో ఫొటోలో మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌తో పాటు స్నేహితుల బృందంతో కలిసి ఉపాసన పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు వాటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. తమ భర్తలు సినిమా షూటింగ్‌లు, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, స్టార్ హీరోల భార్యలు మాత్రం కొంత సమయం కేటాయించి కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!