5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్ మరియు పాకిస్థాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ కొత్త కథలు

Writer: Venkatesh 01:09 PM, 20 నవంబర్, 2025
భారత్ మరియు పాకిస్థాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ కొత్త కథలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో భారత మరియు పాకిస్థాన్ ఉద్రిక్తతల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మే నెలలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు, తానే స్వయంగా జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చానని, లేకపోతే అది అణు యుద్ధానికి దారితీసేదని అన్నారు. ఇదే మాటను గతంలో అనేక సార్లు చెప్పిన ట్రంప్, ఈసారి న్యూయార్క్‌లో జరిగిన సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో మరింత అతిశయోక్తులతో మాట్లాడారు. నేను అడ్డుకోకపోతే అణు బాంబుల ప్రభావం లాస్ ఏంజిల్స్ వరకూ చేరేది అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ట్రంప్ చెప్పిన కథనం ప్రకారం  ఆ సమయంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నప్పుడు, ఇద్దరు దేశాధినేతలకు తాను హెచ్చరిక ఇచ్చాడట. మీరు ఆగ్రహం తగ్గించకపోతే రెండు దేశాలపై భారీ సుంకాలు వేస్తాను. అమెరికాతో మీ వ్యాపారం పూర్తిగా నిలిపేస్తాను అని బెదిరించాడట. తన హెచ్చరికలతోనే రెండు దేశాలు వెనక్కి తగ్గాయని, దీంతో తాను లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని అన్నారు.

ఇవన్నీ చెప్పడమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ తనకే ఫోన్ చేసి, మేం యుద్ధాన్ని ఆపేశాం అని చెప్పారని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తనను సంప్రదించి ధన్యవాదాలు చెప్పారని అన్నారు. ఇలాంటి పరిస్థితులను తానే ఎదుర్కోగలనని, అమెరికా చరిత్రలో ఎవ్వరూ తాను చేసినంతకు చేరలేరని కూడా పొగడ్తల వర్షం కురిపించారు.

అయితే వాస్తవ పరిస్థితులు వేరేవి. ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత, భారత్ మే 7 న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఆ తర్వాత మే 10 న ఇరు దేశాల మిలిటరీ అధికారులు మాట్లాడి, కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది పూర్తిగా రెండు దేశాల నిర్ణయం.

భారత్ ప్రభుత్వం కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, తమ సమస్యలను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో వ్యక్తి జోక్యం లేకుండానే సమస్యను పరిష్కరించుకున్నామని స్పష్టం చేసింది. అయినా కూడా ట్రంప్ మాత్రం ఈ అణు యుద్ధం అడ్డుకున్న కథను తన ఇమేజ్ కోసం మళ్లీ మళ్లీ చెబుతూ వస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ట్యాగ్లు
డోనాల్డ్ ట్రంప్భారత పాక్‌ ఉద్రిక్తతలుఅణుయుద్ధం కథవిదేశీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
సినిమాలు

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ
జనరల్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు
టెక్నాలజీ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!
జనరల్

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!