

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ యాత్ర కారణంగా గుంటూరులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని ముందుగానే ప్రకటించినప్పటికీ, జగన్ తాడేపల్లి నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరి సిద్ధార్థనగర్‌లోని అంబటి రాంబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు బారికేడ్లను దాటుకుని ద్విచక్ర వాహనాలతో కాన్వాయ్‌లో చేరి జెండాలు ఊపుతూ ప్రదర్శనలు నిర్వహించినట్లు సమాచారం.
కాజ టోల్‌ప్లాజా వద్ద పార్టీ నాయకులు 50కు పైగా వాహనాలను నిలిపివేయడంతో గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 35 కిలోమీటర్ల ప్రయాణానికి ఆరు గంటలకు పైగా సమయం పట్టింది. మార్గమధ్యంలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. కొందరు షెడ్లు, గోడలపైకి ఎక్కడంతో స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!