

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ గౌడ్ బీఆర్‌ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హరీష్ రావు రాజకీయ ప్రయోజనాల కోసం క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, మార్చి 2న తిరుచ్చి, జూన్ 1న శివమొగ్గకు వెళ్లిన విషయంపై హరీష్ రావు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే అఘోరీ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.
మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ఈ అంశంపై నిజాలు చెప్పిన కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంపించినప్పటికీ తాము వెనక్కి తగ్గబోమన్నారు. ప్రజల సంక్షేమం కోసం దేవుణ్ని ప్రార్థిస్తామని, అయితే హరీష్ రావు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి పూజలు చేశారని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై హరీష్ రావు లేదా బీఆర్‌ఎస్ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!