

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆహ్వాన కార్యక్రమాన్ని చేపట్టారు. అస్సాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్ సీఎంలను ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు.
ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం గువాహటిలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను కలిసి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. అంతకుముందు అస్సాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోత రవితోనూ వారు భేటీ అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి ఉత్సవాలకు తరలివచ్చే నేపథ్యంలో వేడుకల విశిష్టతను వారికి వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!