

తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘రక్షా ఎక్స్‌పో 2026’లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థలు, భారతీయ తయారీదారులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలు పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పిలుపునిచ్చారు. దిల్లీలో జరిగిన ‘న్యూస్18 డిఫ్‌కాన్ 2026’లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని పెట్టుబడి, వ్యాపార అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఈ ఎక్స్‌పోలో గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు, భారతీయ కంపెనీలు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ప్రొక్యూర్‌మెంట్ బృందాల మధ్య బీ2బీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో తయారీ కేంద్రాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ప్రత్యేక ఇంజినీరింగ్ టెస్ట్ బెడ్‌లు, జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు గ్లోబల్ సంస్థలను ప్రోత్సహించనున్నట్లు జాజు తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాల్లో సోర్సింగ్ భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారం, పెట్టుబడులు, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలకు ఎక్స్‌పోను వేదికగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఎక్స్‌పోలో సాంకేతిక ప్రదర్శనలు, పరిశ్రమల సమావేశాలు, బీ2బీ చర్చలు, రక్షణ రంగ సామర్థ్యాల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!