

విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణ అదృశ్యం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వైకాపా ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది. ఈ వ్యవహారంలో గురుమూర్తికి ఉన్న ఆసక్తిపై ధర్మాసనం ప్రశ్నించింది. సాయికృష్ణ తల్లి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించడం లేదని గురుమూర్తి తరఫు సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ చెప్పగా.. జస్టిస్ సందీప్ మెహతా జోక్యం చేసుకుని, తల్లే కేసును పరిశీలించనప్పుడు గురుమూర్తికి ఇందులో ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు.
సాయికృష్ణ కేసుకు సంబంధించిన పిటిషన్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసినట్లు పేర్కొంది. ముందుగా హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించనివ్వాలని, ఆ తర్వాత అవసరమైతే సవాల్ చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. గురుమూర్తి పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 26కి వాయిదా వేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!