

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫైర్, ఎలక్ట్రికల్ ఆడిటింగ్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఫైర్ సేఫ్టీ ఆడిట్‌లో లోపాలు గుర్తించిన వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రుల యాజమాన్యాలు, సంబంధిత అధికారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు.
ఆసుపత్రుల కోసం సమగ్ర ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు చెక్‌లిస్ట్‌తో ప్రత్యేక జీవో తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. అగ్నిమాపక, విద్యుత్ పరికరాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. సమావేశంలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిత్తల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్ సింగ్‌మాన్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!