

జూరాల ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టు వద్ద రైతులు చేపడుతున్న పోరాటానికి మద్దతుగా వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. తాగునీటి కోసం నీటిని దాచిపెడుతున్నామని చెబుతూ సాగుకు నీరు ఇవ్వకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
మంగళవారం జూరాల వైపు వెళ్తున్న రాంచందర్‌రావుతో పాటు పలువురు బీజేపీ నేతలను మహబూబ్‌నగర్ జిల్లా గొల్లపల్లిలోని ఓ హోటల్ వద్ద పోలీసులు అరెస్టు చేసి జడ్చర్లలోని పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. కర్ణాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల్లో 97.4 శాతం నీటి నిల్వ ఉందని, అందులో నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తే ఇక్కడి పంటలకు ఇబ్బంది ఉండదని రాంచందర్‌రావు అన్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో నీరున్నా పంటలను ఎండబెడతారా? అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!