
.webp&w=3840&q=75)
ఏపీలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు మరియు మండలాల మార్పు–చేర్పులపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. గతంలోనే ప్రతిపాదించిన మార్కాపురం (ప్రస్తుత ప్రకాశం జిల్లా), మదనపల్లి (ప్రస్తుత అన్నమయ్య జిల్లా) జిల్లాల ఏర్పాటుకు సీబీఎన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు కూడా ఆయన అంగీకరించారు.
మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై సమీక్ష అనంతరం ఈ మార్పు–చేర్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
అలాగే, కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. అవి:
అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి
ప్రకాశం జిల్లాలో అద్దంకి
కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో పీలేరు
నంద్యాల జిల్లాలో బనగానపల్లె
శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర
కర్నూలు జిల్లాలో పెద్ద హరివనం ను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆదోని మండలాన్ని విభజించి మరో కొత్త మండలం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అవసరానికి అనుగుణంగా పరిమిత స్థాయిలోనే మార్పులు, చేర్పులు ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. జిల్లాల సరిహద్దుల మార్పులు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా సీఎం స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!