
బిజినెస్

ఎ. రేవంత్ రెడ్డి, వీడీ సతీశన్కు కేరళ ముఖ్యమంత్రిగా ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేరళ విద్య, వైద్యం, అక్షరాస్యతలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సతీశన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం కేరళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!