6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

Writer: Nithish 04:32 PM, 6 జులై, 2026
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు బదిలీలు, కొత్త నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వు–2025 ప్రకారం 26 జిల్లాలకు స్థానిక కేడర్ల ఏర్పాటు, కేడర్ సంఖ్య ఖరారు, ఉద్యోగుల పంపిణీ, అమలు విధానాలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే మార్కాపురం, పోలవరం జిల్లాలు ప్రస్తుతం ఈ ఉత్తర్వుల పరిధిలోకి రావని, ఆ జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తామని స్పష్టం చేసింది.

కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. మల్టీ జోన్–1లో శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు ఉన్న జిల్లాలు, మల్టీ జోన్–2లో బాపట్ల నుంచి శ్రీ సత్యసాయి వరకు ఉన్న జిల్లాలను చేర్చారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని మల్టీ జోన్–1లో చేర్చడంతో పాటు, కృష్ణా–ఎన్టీఆర్–ఏలూరు జిల్లాలు, కర్నూలు–నంద్యాల జిల్లాల మధ్య పోస్టుల పంపిణీకి ప్రత్యేక నిష్పత్తులు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్గదర్శకాలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు పోస్టులకు వర్తించవని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. విచారణ వాయిదా

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. విచారణ వాయిదా

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

సీజేపీ నిరసనకు తుషార్ గాంధీ మద్దతు..

సీజేపీ నిరసనకు తుషార్ గాంధీ మద్దతు..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులుఉద్యోగుల బదిలీలుజోనల్ విధానంస్థానిక కేడర్అమరావతిరాష్ట్రపతి ఉత్తర్వు 2025ఏపీ వార్తలుప్రభుత్వ ఉత్తర్వులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం
జనరల్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌
జనరల్

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి
జనరల్

హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా జస్టిస్‌ శ్యామ్‌ కోశి

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’లో నాని సరసన హీరోయిన్ ఫిక్స్‌.. ఎవరంటే?

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌
జనరల్

శివకార్తికేయన్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ.. అభిమానులతో భేటీ తర్వాత హాట్‌టాపిక్‌

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ
జనరల్

మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు
జనరల్

పురాతన లైబ్రరీపై సుప్రీంకోర్టు విచారణ.. కేంద్రానికి నోటీసులు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌
సినిమాలు

విజయ్‌ సేతుపతి ‘బత్తా’ తెలుగు విడుదలపై అట్లీ హింట్‌

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ
సినిమాలు

గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. ‘రామాయణం’ సెట్‌పై క్లారిటీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ప్రజా అభిశంసన నోటీసు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
జనరల్

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!