

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఆలస్యానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ఆదివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, 2015లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించారని, 2019 నాటికి 2,200 ఎకరాల భూసేకరణ పూర్తయ్యిందన్నారు. మిగిలిన భూసేకరణపై న్యాయపరమైన వివాదాలు, అనంతరం రీటెండరింగ్ కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు.
అదే సందర్భంగా పొగాకు రైతులకు వడ్డీ లేకుండా రూ.50 వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 40 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. పొగాకు అంశాన్ని వైఎస్సార్‌సీపీ రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన ఆయన, రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!