
రాజకీయాలు

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. భాష్యం రామకృష్ణ, సానా సతీశ్, చింతకాయల విజయ్ పేర్లను పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. సామాజిక సమతుల్యత, అంకితభావం, యువతకు ప్రాధాన్యత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు టీడీపీ వెల్లడించింది. సోమవారం వీరు ముగ్గురు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించబడ్డాయి. ఇప్పటికే జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌కు జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!