
రాజకీయాలు

దేశాభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్న మావోయిస్టుల ఉనికిని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ నెలాఖరులోగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ముండలిలో నిర్వహించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 57 వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మావోయిస్టుల నిర్మూలనలో సీఐఎస్ఎఫ్ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ దళాలు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయని ప్రశంసించారు. అనంతరం సీఐఎస్ఎఫ్ ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!