

దశాబ్దాలుగా డీఎంకే–అన్నాడీఎంకే మధ్య కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ పోరాటానికి ఇప్పుడు కొత్త రాజకీయ శక్తులు సవాల్‌గా మారుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా సినీ నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సీఎం విజయ్ నాయకత్వం చర్చనీయాంశంగా మారగా, మరోవైపు బీజేపీ నాయకుడు కె. అన్నామలై తనదైన రాజకీయ శైలితో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
అన్నామలై బీజేపీని వీడతారన్న వార్తలను రాజకీయ విశ్లేషకులు సాధారణ సంస్థాగత మార్పుగా చూడటం లేదు. యువతలో ఆయనకు ఉన్న ఆదరణ, దూకుడు రాజకీయ ధోరణి, ప్రత్యర్థులపై నేరుగా విమర్శలు చేసే స్వభావం ఆయనను తమిళ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా నిలబెట్టాయి. ఎన్నికల్లో భారీ విజయాలు సాధించకపోయినా ప్రజల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ను విస్మరించలేమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భవిష్యత్తులో ఆయన బీజేపీని బలోపేతం చేస్తారా లేదా స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగి సీఎం విజయ్ టీవీకేకు, డీఎంకే–అన్నాడీఎంకే శక్తులకు సవాల్ విసురుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!