
గాసిప్స్

చెన్నైలో జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి రోజే రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ ఆర్ ఎన్ రవి తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. తన మైక్‌ను స్విచ్ ఆఫ్ చేశారని, మాట్లాడనివ్వలేదని, తనను అవమానించారని గవర్నర్ ఆరోపించారు. జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వాలంటూ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సభలో తన బాధ్యతలు తనకు స్పష్టంగా తెలుసని పేర్కొన్న గవర్నర్, ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని గుర్తు చేశారు. గవర్నర్ ఆర్ ఎన్ రవి అసెంబ్లీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ పరిణామంతో ప్రభుత్వానికి, రాజ్ భవన్‌కు మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!