
సినిమాలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ రాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ముంబయిలో జరగనున్న ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సునేత్ర పవార్‌ను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఆమె ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న సునేత్ర పవార్ పదవీ స్వీకారం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అజిత్ పవార్ బారామతి నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలు ఎన్సీపీ రాజకీయ బలం మరింత పెరగడానికి దోహదపడతాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!