
న్యూస్

ఏపీ అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై కాసేపు నిరసన వ్యక్తం చేసి బయటకు వెళ్లిన నేపథ్యంలో, అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన స్పీకర్ ఈ అంశాన్ని సరదాగా ప్రస్తావించారు. సభా సంప్రదాయాలు, సభ్యుల హాజరు తీరుపై ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, “11 వ తేదీన 11 మంది సభ్యులు వచ్చి కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయారు. అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా” అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!