

హైదరాబాద్‌లో భూ కేటాయింపుల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భూ కేటాయింపులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరా భూమిని రూ.90 లక్షలకే కేటాయించారని, ప్రస్తుత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించిందని స్పష్టం చేశారు. ఐదు ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు కేటాయించామని చెబుతూ.. కేటీఆర్ పేర్కొంటున్న రూ.200 కోట్ల విలువ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కేటీఆర్‌కు శ్రీధర్‌బాబు సూచించారు. హిల్ట్ పాలసీతో హైదరాబాద్ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించడం సరికాదని అన్నారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరై రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం బలంగా వాదిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!