
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతులను వేధించే ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టాయి. సెప్టెంబర్ 14 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 1,530 మంది ఈవ్‌టీజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో రద్దీ ప్రాంతాలు, ప్రధాన నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ విస్తృతంగా నిఘా కొనసాగించాయి.
ఖైరతాబాద్, బాలాపూర్‌తో పాటు గణేశ్ నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ సిబ్బంది మఫ్టీలో సంచరిస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించారు. మహిళలు, యువతుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఉత్సవాల సమయంలో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!