
షోస్

గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 40 అడుగులకు చేరింది. కూనవరం వద్ద 14.8 మీటర్లకు, పోలవరం వద్ద 9.98 మీటర్లకు నీటిమట్టం చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!