

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160 సెక్షన్ కింద ఆయన సిట్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగానే ఆయనను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావులను సిట్ విచారించిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ తనకు జారీ చేసిన నోటీసుపై జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. మంగళవారం సిట్ కార్యాలయానికి వెళ్లి విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసుల విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!