
సినిమాలు

ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈఓ చోరీ చేసిన ఘటన పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో తప్పుడు పనులకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన ఆదేశాల ప్రకారం, ఆలయ ఈఓ మురళీకృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో మురళీకృష్ణకు ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది.
సీఎం చంద్రబాబు నాయుడు ఆలయాల సంబంధిత అంశాల్లో హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటాయని స్పష్టంగా తెలియజేశారు. ఇక, విశాఖలో త్వరలోనే మోడ్రన్ సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నగరాన్ని పర్యావరణ హితంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!