

తమిళనాడు మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్‌కుమార్‌కు సంబంధించిన వ్యక్తిగత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. వీడియోలో మంత్రి ఏటీఎం కార్డుతో మొబైల్ స్క్రీన్‌పై తెల్లటి పొడి వంటి పదార్థాన్ని నలిపినట్లు కనిపించగా, పక్కనే రూ.500 నోటు ఉండటం అనుమానాలకు దారితీసింది. దీంతో పలువురు సోషల్ మీడియా వినియోగదారులు అది మాదకద్రవ్యమని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన శరత్‌కుమార్, ఆ వీడియో పాతదని, చెన్నై చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సమయంలో తీసిందని, తన ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ ఫ్రెండ్స్ స్టోరీలో షేర్ చేసినదే ఇప్పుడు వైరల్ అయిందని తెలిపారు.
డ్రగ్స్ ఆరోపణలపై వివరణ ఇస్తూ, తన భార్య మరియు చిన్న కుమార్తెతో కలిసి వీడియో విడుదల చేసిన శరత్‌కుమార్, ఈ ఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగినదని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న తన చిన్నారి మాత్ర మింగకపోవడంతో వైద్యుడి సూచన మేరకు మాత్రను పొడిచేసి ద్రవంలో కలిపి ఇచ్చామని వివరించారు. వీడియోలో కనిపిస్తున్నది అదే మాత్ర అని, దీనిపై కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ వివాదం తగ్గకపోవడంతో ప్రతిపక్ష నేతలు వీడియోపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసుల ద్వారా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!