

సింగరేణి సంబంధిత అన్ని విషయాలను అసెంబ్లీలో వివరంగా చర్చిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోల్ మంత్రిగా కిషన్ రెడ్డి వాస్తవాలు వెల్లడించాలని ఆయన కోరారు. టెండర్ గైడ్‌లైన్స్‌ను సింగరేణి రూపొందించలేదని, 2018లో టెండర్ నిబంధనలను అనుసరించామని తెలిపారు. సింగరేణి విషయంలో కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించరని వ్యాఖ్యానించిన సీఎం, గత పదేళ్ల పాలనలో బకాయిలే మిగిలాయని విమర్శించారు. సింగరేణిపై తాను ఒక్క రూపాయి కూడా భారం వేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ ఒకటేనని వ్యాఖ్యానించిన ఆయన, రాష్ట్రంలో తానే రాజు తానే మంత్రినని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు ఎవరూ పోటీ కాదని అన్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై తన మద్దతు ఉంటుందని సీఎం తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టాలను అంచనా వేయడానికి కమిటీకి బాధ్యతలు అప్పగించామని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!