
జనరల్

రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను జాప్యం లేకుండా కేటాయిస్తామని హామీ ఇచ్చారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని చెప్పడం దారుణమని వాకిటి శ్రీహరి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుకు కేవలం రూ.25 వేల కోట్లే ఖర్చు చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భారీ అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!