
టెక్నాలజీ

యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక ఆరోపణలను పోలీసులు ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై మొత్తం తొమ్మిది కేసులు నమోదైనట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అలాగే యువత, విద్యార్థులను నిషేధిత మావోయిస్టు సంస్థల వైపు ఆకర్షించేలా వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు ఆరోపించారు.
అదేవిధంగా ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవమానకర, అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రజల్లో వ్యవస్థలపై ద్వేషం, వైషమ్యాలను పెంచేలా వ్యవహరించారని, నిషేధిత మావోయిస్టు నాయకుడు హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై కోర్టు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!