
సినిమాలు

రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ కాంగ్రెస్ మరియు పార్టీ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ నుంచి రెండోసారి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, మరో అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్‌కు, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ పీసీసీ నాయకత్వానికి, మంత్రివర్గానికి, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ అవకాశం పార్టీ ఆశీర్వాదంగా భావిస్తున్నానని, తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!