

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రపతిని ఆత్మీయంగా ఆహ్వానించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హైదరాబాద్ సీపీ సజ్జనార్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి రోడ్డు మార్గంగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించబడుతున్న ‘భారతీయ కళామహోత్సవ్ 2025’ను ఆమె ప్రారంభించనున్నారు.
రాష్ట్రపతి ముర్ము శనివారం ఉదయం 9:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు.


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!