

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఇజ్రాయెల్ను సందర్శించే అవకాశమున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25 మరియు 26 తేదీల్లో ఆయన ఆ దేశంలో పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక సదస్సులో మాట్లాడుతూ, మోదీ వచ్చే వారం ఇజ్రాయెల్ పార్లమెంటు క్నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారని వెల్లడించారు.
భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య బలమైన మైత్రి సంబంధాలు ఉన్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరుదేశాల పరస్పర సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం పై చర్చలు జరగనున్నాయని తెలిపారు. భారత్ చిన్న దేశం కాదని, 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో ప్రముఖ శక్తిగా ఎదిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఉన్న ఆదరణ దృష్ట్యా ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకునే అవకాశముందని సంబంధిత వర్గాలు పీటీఐ వార్తాసంస్థకు తెలియజేశాయి. అయితే ఈ పర్యటన పై ఇప్పటివరకు భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ పర్యటన ఖరారైతే, గాజా యుద్ధం అనంతరం మోదీ ఇజ్రాయెల్ను సందర్శించడం ఇదే మొదటిసారి అవుతుంది. గతంలో ఆయన 2017 జూలై నెలలో ఇజ్రాయెల్లో పర్యటించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!