

తమిళనాడులో డీలిమిటేషన్ అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందంటూ డీఎంకే, అన్నాడీఎంకే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీలో ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలను కొనసాగించాలని తీర్మానం చేసిన విజయ్, తాజాగా దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండకూడదంటూ ‘న్యాయమైన డీలిమిటేషన్’కు మద్దతు పలికినట్లు వార్తలు వచ్చాయి.
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ విజయ్ వైఖరిని ప్రశ్నిస్తూ, గతంలో డీలిమిటేషన్‌ను వ్యతిరేకించిన టీవీకే ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు. అన్నాడీఎంకే, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ కూడా ఇదే అంశంపై విజయ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే టీవీకే మాత్రం తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, తమిళనాడు ప్రయోజనాలను కాపాడుతూ దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే ‘న్యాయమైన డీలిమిటేషన్’కే తాము మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!