

జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడలు–2026లో ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆణిముత్యం తానిపర్తి చికిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు అందించిన చికిత విజయంపై క్రీడాభిమానులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అశోక్ కుమార్, శ్రీనివాస్, కన్నం మధు, సురేష్ కాలేరు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్చరీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు టి. రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చికితతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఆమె విజయాన్ని అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రశంసించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!