
గాసిప్స్

లోక్‌సభలో విపక్షాల తీవ్ర ఆందోళనలతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. పరిస్థితి అదుపు తప్పడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో విపక్షాలు ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం కనీసం 100 మంది లోక్‌సభ సభ్యుల సంతకాల మద్దతుతో ఈ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఈ అంశం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!