

ఖలిస్థానీ వేర్పాటువాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తా మాన్హటన్ ఫెడరల్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. అమెరికా అటార్నీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, యూఎస్ మెజిస్ట్రేట్ జడ్జి సారా నెట్బర్న్ ముందు హాజరైన గుప్తా, కిరాయి తీసుకొని హత్య చేయడానికి కుట్ర, హత్య ప్రణాళిక, మనీలాండరింగ్ కుట్ర వంటి మూడు అభియోగాలను ఒప్పుకున్నాడు. ఈ కేసులో అతనికి 40 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశముంది. మే 29 న శిక్ష ఖరారు కానుంది.
అమెరికా గడ్డపై జరిగిన ఈ కుట్రను భగ్నం చేశామని గతంలో అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ కేసులో గుప్తాకు ఓ భారత ప్రభుత్వ అధికారి నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చెక్ రిపబ్లిక్ అధికారులు గుప్తాను అరెస్టు చేసి, అనంతరం అమెరికా సంయుక్త రాష్ట్రాలుకు అప్పగించారు. భారత ప్రభుత్వాధికారిపై చేసిన ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండిస్తూ, అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తాజా పరిణామాలపై భారత్ ఇంకా స్పందించలేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!