

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త ఆర్థిక ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించారు. ఈ ప్రతిపాదన ప్రకారం మూడో బిడ్డ పుట్టిన కుటుంబాలకు ₹30,000, నాలుగో బిడ్డకు ₹40,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జననాల రేటు తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో వృద్ధ జనాభా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అయితే ఈ పథకంపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పిల్లల పెంపకం చాలా భారమైందని, ఒకసారి ఇచ్చే ప్రోత్సాహకం దీర్ఘకాలిక ఖర్చులకు సరిపోదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని రాజకీయ ప్రయోజనాలతో ముడిపెడుతుండగా, మరికొందరు జనాభా పెంపు కంటే విద్య, ఉపాధి, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!