
జనరల్

గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సిట్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో A4గా ఉన్న సురేష్ సిట్ ఎదుట సరెండర్ అయ్యాడు. సాయి కృష్ణ మృతికి దారితీసిన పరిస్థితులు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
సాయి కృష్ణ లాకప్ డెత్ అనంతరం మృతదేహాన్ని మాయం చేయడంలో సురేష్ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఘటన తర్వాత సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో సెటిల్‌మెంట్ చేసేందుకు కూడా సురేష్ ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. సీఐ నాగరాజుకు సురేష్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు సమాచారం.
సాయి కృష్ణ లాకప్ డెత్ అనంతరం జరిగిన పరిణామాల్లో సురేష్ పాత్ర ఉన్నట్లు నిర్ధారించిన సిట్ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన సరెండర్ కావడంతో దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!