

కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ఇన్నాళ్లుగా ప్రచారం చేశారని, అయితే తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి 67 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లోనే తనకు సంబంధించిన భూముల వివరాలను వెల్లడించారని తెలిపారు. వెయ్యి ఎకరాలంటూ చేసిన ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, ఇన్నాళ్లూ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తమ కుటుంబ భూములపై కూడా విచారణకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. చింతమడకలో కేసీఆర్ పుట్టిన సమయంలో తమ కుటుంబానికి రెండెకరాల ఇల్లు మాత్రమే ఉండేదని, తమ నానమ్మ గ్రామమైన కోనాపూర్‌లోని వందల ఎకరాల భూమి మానేరు డ్యామ్‌లో మునిగిపోయిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూములపైనా, కేసీఆర్ కుటుంబ ఆస్తులపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!