
జనరల్

పార్లమెంట్‌లో కీలక అంశాలు చర్చకు రానున్న నేపథ్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ తన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో సభల్లో పూర్తి స్థాయి హాజరు ఉండాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ముఖ్యమైన జాతీయ అంశాలపై చర్చలు జరగనున్నందున ఎంపీలు చురుకుగా పాల్గొనాలని సూచించింది.
ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాల ఎంపీలు కూడా ఈ రోజుల్లో సభలకు హాజరవ్వాలని కాంగ్రెస్ కోరింది. పార్లమెంట్‌లో ఐక్యంగా వ్యవహరించి కీలక అంశాలపై తమ అభిప్రాయాలను బలంగా వినిపించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!