

మాదిగలకు తెలంగాణ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి పార్లమెంట్లో మాదిగల ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో కూడా ఒక్క మాదిగకు అవకాశం లేకపోవడం వివక్షకు నిదర్శనమని మందకృష్ణ ఆరోపించారు.
మాదిగలను పార్లమెంట్‌కు వెళ్లకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా మాదిగకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ కార్యాలయాల ముందు ఎంఆర్పీఎస్ ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించి, సాయంత్రం 4 గంటలకు డీసీసీ అధ్యక్షులకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!