

తెలంగాణ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇప్పుడు తన విద్యా సామ్రాజ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటి విస్తరించడానికి పూనుకున్నారు. విద్యా రంగంలో తన పేరును దేశవ్యాప్తంగా చాటాలనే లక్ష్యంతో, ఆయన ఆంధ్రప్రదేశ్లో తొలి అడుగు వేశారు. తిరుపతిలోని శ్రీ ఇంజినీరింగ్ కాలేజీని ఇటీవల కొనుగోలు చేసినట్లు మల్లారెడ్డి ప్రకటించారు. అంతేకాక, విశాఖపట్నంలో మరో కాలేజీని ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి, “శ్రీవారి ఆశీర్వాదంతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలు స్థాపించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. పేదలకు విద్య, వైద్యం అందించడమే నా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. అదే సమయంలో, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కూడా శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు.
మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, మేనేజ్మెంట్, స్కూల్స్, యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏపీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా తన సంస్థలను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. తిరుపతిలో కొనుగోలు చేసిన కాలేజీని “మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్” పేరుతో నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. విద్యా రంగం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా డీమ్డ్ యూనివర్సిటీలు, ఆస్పత్రులు స్థాపించాలన్నది ఆయన ప్రణాళిక.
మల్లారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో, విద్యా రంగంలో చర్చనీయాంశంగా మారింది.















కామెంట్స్ (2)
చామకూర మల్లారెడ్డి మరో పెద్ద అడుగు!
Big move by Mallareddy!